మంత్రి కి బహుజనుల సమస్యలను వివరించిన బహుజన సేనా నాయకులు
1 min readసానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్
గత ప్రభుత్వంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలి
26 సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరణ చెయ్యాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: మంగళగిరిఉండవల్లి నివాసంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి,ఐటీ, మానవ వనరులు,రియల్ టైమ్ గవర్నెన్స్ మంత్రి నారా లోకేష్ ని బహుజన సేన నాయకులు మతే బాబి కలిశారు. బహుజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించి గత ప్రభుత్వంలో రద్దు చేసిన 26 సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరణ చేయాలని,గత ప్రభుత్వం ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని మంత్రి లోకేష్ కు వివరించారు, మంత్రి నారా లోకేష్ సమస్యలు పరిష్కరించే దిశగా సానుకూలంగా స్పందించన్నరు.బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితచరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చిఅందించాలని, బహుజనులను రానున్న రోజుల్లో సామాజిక సంస్కృతిక ఆర్థిక రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాలని, 50 సంవత్సరాల నిండిన సామాజిక ఉద్యమకారులకు పెన్షన్ అందించే ఆలోచన చేయాలని బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు,ఆర్.పి.ఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్తే బాబి కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన ప్రతినిధులు పాల్గొన్నారు.