బక్రీద్ పండుగ ను ప్రశాంతంగా జరుపుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ముస్లిం ల పవిత్ర త్యాగాల పండుగ బక్రీద్ ను ప్రశాంతంగా జరుపుకోవాలని మంత్రాలయం ఎస్సై గోపినాథ్ సూచించారు. శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్ ముస్లిం సోదరులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో పండుగ ను జరుపుకోవాలని సూచించారు. గోవధ చేయకుండా వేరే రకంగా జరుపుకోవాలని సూచించారు. ముస్లిం సోదరులు సహకరించాలని కోరారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలను సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదన్నారు. ఈ సమావేశంలో జామీయ మసీదు పేష్ ఇమాం ఖాజాబందేనవాజ్, ముస్లిం పెద్దలు సాబ్ జాన్, గాజుల బాష, ఖాజాహుశేన్ తాత, సాబువలి, చాంద్ బాషా, కునాల్, రఫీ, వగరూరు పెద్దలు అబ్దుల్, హిమాయత్, డీలర్ రఫీ, కోలేబాష, చిలకలడోణ పెద్దలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.