PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్యాగానికి ప్రతీక బక్రీద్‌..

1 min read

ఖురాన్‌ బోధనలు చేసిన మత పెద్దలు

ఈద్గా, మసీద్‌ల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: త్యాగానికి ప్రతీకగా బక్రీద్‌ పండుగను సోమవారం ఆత్మకూరు పట్టణంలో కోనేరు దగ్గర పెద్ద మసీదులో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలు ఈద్గా, మసీద్‌ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  పట్టణ శివారులోని దుద్యాల రోడ్డు  మార్గంలో ఉన్న ఈద్గా మైదానానికి వందలాది సంఖ్యలో ముస్లింలు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు ఖురాన్‌ బోధనలను, బక్రీద్‌ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ త్యాగ గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు.  ముస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ముస్లిం మత పెద్దలు  లతో పాటు టిడిపి నాయకులు షాబుద్దీన్ ఉన్నారు.

About Author