ఉద్యోగుల సంఘం తాలూకా అధ్యక్షులుగా బాలరాజు
1 min readఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి:నూతన కమిటీ
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ)నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా ఎన్నికలు ఆదివారం పట్టణంలోని స్థానిక ఆర్&బీ గెస్ట్ హౌస్ ఆవరణంలో జరిగాయి.ఈ ఎన్నికలను ఎన్నికల అధికారి శ్రీహరి మరియు సహాయ ఎన్నికల అధికారి శ్రీనివాసులు నిర్వహించారు.ఎన్నికల పరిశీలకులుగా ఏపీజీఈఏ నంద్యాల జిల్లా అధ్యక్ష మరియు కార్యదర్శులు నాగేంద్రప్ప మరియు తిరుపాలయ్యలు వ్యవహరించారు.ఎన్నికల అధికారి శ్రీహరి మాట్లాడుతూ నందికొట్కూరు తాలూకా ఎన్నికల్లో భాగంగా 19 స్థానాలకు పోటీ నిర్వహించగా ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క నామినేషన్ చొప్పున 19 నామినేషన్లు దాఖలు కావడంతో అన్ని స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని ఆయన తెలిపారు.ఉద్యోగుల సంఘం నూతన తాలూకా కమిటీ ఎన్నిక వివరాలు:కె.బాలరాజు అధ్యక్షుడుగా, ఆర్.నర్సరాజు ప్రధాన కార్యదర్శిగా,రషీద్ సహాధ్యక్షుడుగాపి.రాముడు కోశాధికారిగాఉపాధ్యక్షులుగా భువనేశ్వరి, జగదీష్ కుమార్,రంగస్వామి,కృష్ణమూర్తి,జ్యోతి,నూరుల్లా మరియు నాగేశ్వరమ్మ జాయింట్ సెక్రటరీలుగా గుట్టలయ్య,మహబూబ్ బాష,శ్రీనివాసులు,జాఫర్,కామేశ్వర ప్రసాద్,రామచంద్రయ్య మరియు మద్దిలేటి మరియు ఆర్గనైజింగ్ సెక్రెటరీగా టైపిస్టు వెంకటస్వామి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నందికొట్కూరు కార్యవర్గానికి పలువురు వక్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తాలుకాలో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తమ వంతుగా కృషి చేస్తామని ఒకవేళ సమస్యలు పరిష్కారం కాని ఎడల జిల్లా కమిటీ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని నూతన అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు తెలిపారు.