19.న కొండపేట గ్రామంలో బలరామ పూర్ణిమ మహోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం( ఇస్కాన్) కొండపేట గ్రామంలో వెలసిన ఇస్కాన్ భజన కుటీరం భక్తులు నిర్వాహకులు వారి సహకారంతో ఈనెల 19వ తేదీన సోమవారం బలరామ పూర్ణిమ మహోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఇస్కాన్ భక్తులు నిర్వాహకులు ఏర్పాట్లు చురుగ్గా నిర్వహిస్తున్నారు. పౌర్ణమి నాడు బలరాముడు జన్మించడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొండపేట గ్రామంలోని రామ మందిరంలో బలరాముడికి ఉదయం నాలుగు గంటల 30 నిమిషాలకు మంగళ హారతి. ఉదయం5.30 నిమిషముల నుండి7.30 నిమిషముల వరకు జపం నిర్వహిస్తారు. ఉదయం8.30 నిమిషముల నుండి11.15 వరకు భజన కీర్తన కథ ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి బలరామకృష్ణులకు శంకభిషేకం 11.40 నిమిషాల వరకు పుష్పాభిషేకం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి పంచహారతి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు మహా ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించనున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి కొండపేట గ్రామంలో బలరామకృష్ణులతో నగర సంకీర్తన భక్తులచే నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు జమ్మలమడుగు కడప మైదుకూరు కమలాపురం చెన్నూరు వివిధ ప్రాంతాల నుంచి ఇస్కాన్ భక్తులు తరలి రానన్నారు.