PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

4 న కేజీ నుండి పీజీ వరకు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్

1 min read

AISF జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ

ఈ సందర్భంగా స్థానిక హోళగుంద మండల కేంద్రం తేరు బజార్ నందు పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ సందర్భంగా AISF జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ AISF మండల కార్యదర్శి సతీష్ కుమార్ మాట్లాడుతూ_* నీట్ (NEET)కోసం విద్యార్థులు ఏళ్ల పాటు చదువుతారు. నీట్ (NEET)పేద విద్యార్థుల కోసం కాదు. ఉన్నంత వర్గాల కోసం అనే విధంగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇలా అయితే పేద విద్యార్థులు నీట్ (NEET)పై నమ్మకాన్ని కోల్పోతారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇటీవలే నీట్ (NEET).. నెట్ (NTA) పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి.పి.హెచ్.డి అడ్మిషన్ల  కోసం ఇటువలె ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. టి ఐ ఎస్ ఎస్ ఐఐటి ముంబై నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘాల నేతలపై అక్రమ కేసులు నిర్బందనాలు యూనివర్సిటీ వ్యక్తికరణ  ప్రజాస్వామ్య అనిచివేత చర్యలు ఆపాలి. పాఠశాలల మూసివేతను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలు నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో 65 సార్లు పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని దీనిపైన పార్లమెంటులో మోడీ చర్చించి న్యాయం చేయాలని వారు కోరారు. లీకేజీలతో విద్యార్థులు నష్టపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.హోళగుంద మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు యజమాన్యం ప్రిన్సిపాల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ ఈ బంద్ కు స్వచ్ఛందంగా  సహకరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF)గా కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో AISF మండల సహాయ కార్యదర్శిశ రాజేష్ AISF మండల ఉపాధ్యక్షుడు మల్లయ్య AISF నాయకులు రాజు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

About Author