నందికొట్కూర్ లో బంద్ విజయవంతం..
1 min readవర్గీకరణకు వ్యతిరేకంగా మాల జేఏసీ ఆధ్వర్యంలో
ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు బంద్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మాల జేఏసీ నియోజకవర్గ కమిటీ ఏసీ నాగేష్,శివ ప్రసాద్, అచ్చన్న,మాల మహానాడు సీనియర్ నాయకులు డాక్టర్ రాజు ఆధ్వర్యంలో పట్టణంలో బుధవారం భారత్ బంద్ విజయవంతం అయింది. రాజకీయ,ప్రజా,కుల సంఘాల తెలుపు మేరకు భారత్ బంద్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు పట్టణంలో కొత్త బస్టాండు పటేల్ సెంటర్ పగిడ్యాల రోడ్డు ఆత్మకూరు రహదారి వెంట ఉన్న షాపులను మూసి వేయిస్తూ జేఏసీ నాయకులు మరియు విద్యావంతులు యువకులు ఈ బంద్ లో పాల్గొని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలను మూసి వేయించారు.ఉదయాన్నే ఆర్టీసీ బస్టాండులో బస్సులు వెళ్లకుండా వారు బస్సులను అడ్డుకున్నారు.వర్గీకరణ వద్దే వద్దని జనాభా ప్రాతి పదికన మాలలే అధికంగా ఉన్నారని వారు అన్నారు నినాదాలు చేసుకుంటూ పట్టణంలో నిరసన చేపట్టారు.వర్గీకరణను రద్దు చేసేంత వరకు పోరాడుతామని వారు అన్నారు.మిడుతూరు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ పాఠశాల మరియు మోడల్ పాఠశాలలను జేఏసీ నాయకులు విద్యార్థులను ఎండ్లకు పంపించి పాఠశాలలను మూయించి నిరసన చేపట్టారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మనోహర్ ఏసన్న ప్రసాద్ రాజు, హుస్సేనాళం భాస్కర్ రమణ మోహన్ శేఖర్ శాంతరాజు అనిల్ పార్థు వై రాజు తదితరులు పాల్గొన్నారు.