సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రాష్ట్రాలలో ఏ బి సి డి వర్గీకరణ చేయాలని వినతి
1 min readజిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వికి వినతిపత్రం అందజేసిన నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జ్ సొంగ మధుసూదనరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మాదిగ పోరాట సమితి 30 సంవత్సరాలుగా పోరాడిన పోరాట యోధులను పోగొట్టుకున్నందుకు గాను ముందుగా ఒక్క నిమిషం శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి ఘన నివాళులర్పిచారు. అలాగే నేడు అత్యంత సంతోషకరమైన రోజు ఏమనగా సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యులతో బెంచ్ చంద్ర చూడు నేతృత్వంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చున్న సుప్రీం కోర్ట్ తీర్పు ఆధారంగా, ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వములో శాసనసభలో చిత్తశుద్ధితో ఏబిసిడి వర్గీకరణ అమలు చేయవలసిందిగా ఆంధ్ర రాష్ట్రం నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మాన్యశ్రీ పరిసిపోగు శ్రీనివాసరావు పిలుపుమేరకు అన్ని జిల్లాల కలెక్టర్ లకు మెమొరండాలు అందజేయవలసినదిగా ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి కి ఏలూరు నవ్యాంధ్ర ఎం ఆర్ పి ఎస్ జిల్లా ఇన్చార్జ్ సొంగ మధుసూదనరావు నేతృత్వంలో సోమవారం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి సీఎం ఆఫీస్ కి రిఫర్ చేస్తానన్నరని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు యర్రా నాగమల్లేశ్వరరావు, పరిసిపోగు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.