ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి: యూటీఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రాథమిక పాఠశాల గత ప్రభుత్వం ఒకటి రెండు తరగతులు మాత్రమే ప్రాథమిక పాఠశాలలని, మిగతావన్నీ హైస్కూల్లో మెర్జ్ చేయడం దానివలన బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతాలలో ఉండే బాలబాలికలు విద్యకు దూరం కావడం జరుగుతుంది. కనుక జరిగిన నష్టాన్ని తిరిగి నిర్మించాలంటే ప్రాథమిక పాఠశాలను ఒకటి నుంచి ఐదు వరకు, ఆ ప్రాంతాలలో ఉండేటట్లు చేయాలి అది జరగాలంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 117 రద్దు చేయాలి ,ప్రతి ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5 తరగతులు ఉండేలా చేయాలని, ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేటట్లు చేయాలని, ఖాళీగా ఉన్న 25వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రాధమిక విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి , అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సి వెంటనే ప్రకటించాలని ఈరోజు కర్నూలు మండలంలో జరిగిన సమావేశంలో ఈ విషయాలపై UTF జిల్లా అధ్యక్షులు రవికుమార్ ప్రధాన కార్యదర్శి నవీన్ పాటి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో కర్నూలు మండల అధ్యక్షుడు సత్యనారాయణ , ప్రధాన కార్యదర్శి సోమన్న , జిల్లా కౌన్సిలర్ జయరాజు , రామచంద్రుడు , శేషఫని,హనుమన్న, కిరణ్, శోకత్ అలీ మొదలగు వారు పాల్గొన్నారు.