PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూల్ హాట్ ఫౌండేషన్ లో బేసిక్ లైఫ్ సపోర్ట్ వర్క్ షాప్

1 min read

పారామెడికల్ విద్యార్థులతో అవగాహన కార్యక్రమం

హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూల్ హాట్ ఫౌండేషన్ లో బేసిక్ లైఫ్ సపోర్ట్ వర్క్ షాప్ పారామెడికల్ విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నందు కర్నూల్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఈసీజీ , కార్డియాలజీ మరియు క్యాథల్యాబ్, అనస్తిసియా టెక్నిషన్లతో శిక్షణ కార్యక్రమం ద్వారా రోగులకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అడ్వాన్స్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ చాలా ముఖ్యమైనదని, ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా నిర్వహించాలని అన్నారు.రోగులకు కాపాడడంలో ప్రథమ చికిత్స ద్వారా వారి లైఫ్ సేవ్ చేయగలమని అన్నారు.రోగి అకస్మారక స్థితిలో ఉన్నప్పుడు వారికి ఏ విధంగా కాపాడాలి అనే దానిపైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కర్నూల్ మెడికల్ కాలేజ్ లో రేపు ఎల్లుండి రెండు రోజులపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులతో అడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు .డాక్టర్ అశోక్ 90 వేల మంది డాక్టర్స్ మరియు టెక్నీషియన్లను ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అశోక్  విజయవాడ గత 25 సంవత్సరాలు నుంచి బేసిక్ లైఫ్ సపోర్ట్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు అవగాహన కల్పించారు.  అనంతరం వారు మరెన్నో అడ్వాన్స్ బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రోగ్రాంలు చేసినట్లు తెలిపారు. వైద్య విద్యార్థుల హార్ట్ ఫౌండేషన్ లో 50 మంది వైద్య విద్యార్థులలో కార్డియాలజీ, అనస్తిసియా టెక్నీషియన్స్ మరియు స్టాఫ్ నర్స్ లకు హాట్ ఫౌండేషన్ లో అడ్వాన్స్ బేసిక్ లైఫ్ సపోర్ట్ సర్టిఫికెట్ అందజేశారని అని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్. వై.అశోక్ MD సీనియర్ అనస్థీషియాలజిస్ట్ మరియు క్వాలిఫైడ్ BLS & ACLS ఇన్‌స్ట్రక్టర్, విజయవాడ. అనస్తిసియా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్.శ్రీలత మరియు వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గుండె వైద్య నిపుణులు మరియు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్.పి.చంద్రశేఖర్ అని అన్నారు.

About Author