తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండండి…
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే_ శ్ బూసినే విరుపాక్షి తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆలూరు_నియోజకవర్గం_ ఎమ్మెల్యే_ బూసినే_ విరుపాక్షి_ సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్దంగా ఉండాలని ఆలూరు_నియోజకవర్గం_ ఎమ్మెల్యే__విరుపాక్షి_ కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసు ,రెవెన్యూ, మున్సిపల్ ,అగ్నిమాపక, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. మట్టి మిద్దెలు, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లల్లో ఎవరూ నివాసం ఉండవద్దన్నారు.