PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిరుత సంచారం పై అప్రమత్తంగా ఉండండి

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మహానంది క్షేత్ర పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ అధికారి మిశ్రా గురువారం మహానందిలో పేర్కొన్నారు. గత కొన్ని రోజుల నుంచి మహానంది క్షేత్ర పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం పై మొదట మహానందిలోని అటవీ శాఖ పర్యావరణ కేంద్రంలో స్థానిక ఫారెస్ట్ శాఖ సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని చిరుత సంచారం జరుగుతుందన్న గోశాల, ఆలయ మాడవీధులు విద్యుత్ కార్యాలయ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డికి కొన్ని సూచనలు చేశారు. మొదట గోశాలను ప్రస్తుతం ఉన్న అటవీ సమీప ప్రాంతం నుండి ఇతర చోటికి తరలించాలని సూచించడంతోపాటు ఆలయ డంపు యార్డును కూడా ఆలయ సమీపంలో నుండి తొలగించాలని తెలియజేశారు. గోశాల దగ్గరగా ఉన్న కారణం చేత మరియు డంపు యార్డ్ వద్ద కుక్కలు పందులు మనము వేసిన పదార్థాలను బయటికి తీసుకు రావడంతో పాటు అక్కడ స్థానిక జంతువుల సంచారం ఉండడంవల్ల చిరుత తరచూ మహానంది క్షేత్ర పరిసరాల్లోకి వస్తుందని కన్జర్వేటర్ పేర్కొన్నారు. తాత్కాలికంగా గోశాల మరియు మాడ వీధుల గుండా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేస్తే కొంతవరకు చిరుత నుండి మనం రక్షణ పొందవచ్చు అన్నారు. రాత్రి 9 లేదా 9: 30 తరువాత ఆలయ వెనుక భాగాన్ని మూసివేయాలని భక్తులు ఆలయ పరిసర ప్రాంతాల్లో నిద్రించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధించాలని సూచించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తే సంచారం తగ్గుతుంది అన్నారు. మహానంది బోయిలకుంట్ల మెట్ట రహదారిని శ్రీశైలంలో మాదిరి రాత్రి పది గంటల నుంచి మూచివేయాలని సూచించారు. దీనిపై ఈవో మాట్లాడుతూ గతంలో ఈ దారి నందు దొంగలు కొడుతున్నారు అంటూ పోలీసులు మూసివేస్తే ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని కన్జర్వేటర్కు వివరించారు. గోశాల మార్చాలంటే దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు ఉండాలని తెలిపారు.. ఈ విషయాలన్నీ దేవాదాయ కమిషనర్ కు తెలియజేసి మార్పులు చేర్పులు చేపడుతామని కన్జర్వేటర్ మిశ్రాకు విన్నవించారు. పచ్చర్ల సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మహానంది మరియు పచ్చర్ల ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసి చిరుతను బంధించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కన్జర్వేటర్ మీడియాతో పేర్కొన్నారు. ఇతర అటవీ ప్రాంతాల నుండి బంధించి తెచ్చిన చిరుతలను మహానంది అటవీ ప్రాంతంలో వదిలారు అనే ఆరోపణలు ఉన్నాయి కదా అవే దాడి చేస్తున్నాయా అన్న ప్రశ్నకు సమాధానం గా  ఎక్కడో సుదూర ప్రాంతంలో 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఒకటి అర వదిలి ఉండవచ్చని అవి ఇక్కడికి వచ్చి దాడులు చేస్తాయని భావించడం లేదని కన్సర్వేటర్ మిశ్రా మీడియా అడిగిన ప్రశ్నకు తెలియజేశారు. ఇలాంటి వాటిపై కూడా నిపుణులతో చర్చించి వారి సలహా సూచనల మేరకు చర్యలు ఉంటాయని తెలియజేశారు. ఎల్లవేళలా సిబ్బంది అందుబాటులో ఉంటారని కొంత సిబ్బంది సమస్య కూడా ఉందని 5, వేల ఎకరాలు పర్యవేక్షించడానికి సిబ్బంది ఒక్కరే ఉంటున్నారని కొన్ని సమస్యలు సవాళ్లను సిబ్బంది ఎదుర్కొనుచున్నారని మిశ్రా మీడియాకు వివరించారు. అనంతరం ఆలయ ఈవో కన్సర్వేటర్ మిశ్రా మరియు డిప్యూటీ డైరెక్టర్ అనురాగ్ మీనా ను సన్మానించి ఆలయ ప్రసాదం అందజేశారు ఆయన వెంట డిప్యూటీ డైరెక్టర్ అనురాగ్ మీనా, రేంజర్ దినేష్ కుమార్ రెడ్డి డిఆర్ఓ నాగేంద్ర, హైమావతి, ఆలయ ఏఈఓ మధు ఆలయ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author