PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తమ జ్ఞాన నేత్రంతో ఈ ప్రపంచాన్ని చూడగలగడం అభినందనీయం

1 min read

అంధత్వాన్ని శాపంగా కాకుండా ఆత్మవిశ్వాసంతో అధిగమించడం అభినందనీయం.

అమ్మ అంధుల పాఠశాలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అంధత్వాన్ని శాపంగా భావించకుండా ఆత్మవిశ్వాసంతో అధిగమించడం అభినందనీయమని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు .కర్నూల్ నగర సమీపంలోని పసుపల గ్రామం వద్ద ఉన్న అమ్మ అంధుల పాఠశాల విద్యార్థులకు ఒక నెల రోజులకు సరిపోయే విధంగా నిత్యావసర. వస్తువులను ఆయన పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అమ్మ అంధుల పాఠశాల నిర్వాహకుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ అమ్మ అంధుల పాఠశాలలోని విద్యార్థులు చూపు లేకపోయినప్పటికీ తమ జ్ఞాన నేత్రంతో ఈ ప్రపంచాన్ని చూడగలగడం అభినందనీయమని చెప్పారు. అమ్మ అంధుల పాఠశాలను నిర్వహిస్తున్న నిర్వాహకుడు సుధాకర్ను అభినందించారు. అంధత్వంతో బాధపడే వారికి అక్షర జ్ఞానాన్ని పెంపొందించేందుకు లూయిస్ బ్రెయిలీ రూపొందించిన ప్రత్యేక లిపి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు. మామూలు విద్యార్థులతో పోలిస్తే  అంధత్వంతో బాధపడే విద్యార్థులకు ప్రత్యేక రక్షణ అవసరమని ఆయన తెలియజేశారు. ఇందుకోసం ప్రభుత్వాలు ,ఎన్జీవో సంఘాలు కృషి చేయాలని సూచించారు .అలాగే ప్రభుత్వ ,ప్రైవేటు రంగాలలో అంధులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మామూలు ఆశ్రమాలతో పోలిస్తే అంధుల కోసం ఆశ్రమం నిర్వహించడం కష్టకరమని, అనునిత్యం వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమ్మ అంధుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకువస్తే అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తానని ఆయన వివరించారు. అమ్మ అంధుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు పరీక్షలు రాయడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని నిర్వాహకుడు సుధాకర్ కోరిక మేరకు అందజేశానని, తన సహకారం నిరంతరం ఉంటుందని ఆయన వివరించారు. ఇలాంటి ఆశ్రమాల నిర్వహణకు సంబంధించి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ కోరారు. ఈ సందర్భంగా అమ్మ అంధుల పాఠశాల నిర్వాహకుడు సుధాకర్ను సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సన్మానించారు.

About Author