PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డోన్​ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: నంద్యాల జిల్లా డోన్​ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్​ రెడ్డిని శనివారం ప్రముఖ కార్డియలజిస్ట్​ డా. చంద్రశేఖర్​, సీనియర్​ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్​ డా. శంకర్​ శర్మ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోన్​ నియోజకవర్గ అభివృద్ధి  ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్​ రెడ్డితో సాధ్యమన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన జయ సూర్య ప్రకాశ్​ రెడ్డి… భవిష్యత్​ లో మరెన్నో పదవులు అలంకరించాలని కార్డియలజిస్ట్​ డా. చంద్రశేఖర్​, సీనియర్​ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్​ డా. శంకర్​ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.  అనంతరం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్​ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి..శాలువతో ఘనంగా సన్మానించారు.

About Author