PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రయాణీకుల‌కు మెరుగైన సేవ‌లు అందించాలి..

1 min read

రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ‌ మంత్రి టి.జి భ‌ర‌త్‌

ఆర్టీసీ అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించిన‌ మంత్రి టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క‌ర్నూలు జిల్లా ఆర్టీసీలో నెల‌కొన్న స‌మ‌స్య‌లు ప‌రిష్కరించ‌డంతో పాటు చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌పై క్రమ‌ప‌ద్దతిలో ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. న‌గ‌రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా ప్ర‌జా రవాణా అధికారి శ్రీనివాసులుతో పాటు ఇత‌ర అధికారుల‌తో ఆయ‌న స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. క‌ర్నూలు జిల్లాలో ఆర్టీసీ బ‌స్టాండుల ప‌రిస్థితి గురించి ఆరా తీశారు. ఆర్టీసీకి ఉన్న స్థ‌లాల‌ను ఏ విధంగా అభివృద్ధి చేయాలో స‌మ‌గ్రంగా నివేదిక త‌యారు చేయాల‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌యాణీకుల సౌక‌ర్యార్దం చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా కర్నూలు బస్టాండు, ఆదోని, ఆలూరు, మంత్రాలయంలలో గల ఖాళీ స్థలాలను OS-15 ప్రకారం టెండర్లు పిలిచి అభివృద్ధి చేయడంతో పాటు ఆదాయం స‌మ‌కూరే అవ‌కాశం ఉంద‌ని అధికారులు మంత్రికి వివ‌రించారు. ప్రయాణీకుల సౌక‌ర్యం కోసం బ‌స్టాండులో ఉన్న స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి టి.జి భ‌ర‌త్ అధికారుల‌కు చెప్పారు. త‌క్కువ దూరం ప్రయాణాలు సాగే రూట్లలో ఎల‌క్ట్రిక్ బ‌స్సులు తీసుకురావ‌డంపై స‌మావేశంలో చ‌ర్చించారు. ఈ సమావేశంలో కర్నూలు డిప్యూటి చీఫ్ మెకానికల్ ఇంజినీరు శ్రీ హరినాథ్ బాబు, కర్నూలు-1 మరియు కర్నూలు-2 డిపో మేనేజర్లు మరియు అసిస్టెంట్ మేనేజర్లు పాల్గొన్నారు.

About Author