సుపరిపాలనలో భాగంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు
1 min readశారీరక విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల సైకిళ్ళు ఉచిత పంపిణీ
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: సంక్షేమం, అభివృద్ధి ప్రజల ఆకాంక్షల దిశగా ప్రజలందరి కృషి తోడై మనదేశం, రాష్ట్రం అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలబడేలా అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ ప్రాంగణంలో సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ఇద్దరు విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల సైకిళ్లను జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అందజేశారు. సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ఇద్దరు శారీరక వైకల్యముతో బాధపడుచున్న విభిన్న ప్రతిభావంతులు మూడు చక్రాల సైకిళ్ళు అందించవలసిందిగా జిల్లా కలక్టర్ వారికి అర్జీ సమర్పించారు. సదరు శారీరక వైకల్యముతో బాధపడుచున్న విభిన్న ప్రతిభావంతులు మూడు చక్రాల సైకిళ్ళు పొందుటకు నిబంధనల మేరకు అర్హత కలిగి యున్నందున వారికి మూడు చక్రాల సైకిళ్లు అందించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు వెంటనే పెదవేగి మండలం లక్ష్మీపురంకు చెందిన శ్రీమతి ఇంద్రాదేవి, ద్వారకాతిరుమలకు చెందిన కడిమి ఆంజనేయులకు జిల్లా కలక్టర్ వారి చేతుల మీదుగా యిరువురు లబ్ది దారులకు మూడు చక్రాల సైకిళ్ళు ఉచితముగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధిగారి వి. విశ్వేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి. రామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.