వ్యక్తిత్వ వికాస గ్రంధం భగవద్గీత
1 min readగరుడాద్రి వనజ కుమారి .. తెలుగు పండితులు
అత్యంత భక్తిశ్రద్ధలతో సంపూర్ణ భగవద్గీత పారాయణం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భగవద్గీత సమస్త మానవాళిని ఉద్దరించే గ్రంధరాజమని, మానవుడు మాధవుడుగా తనను తాను సముద్దరించుటకు ఉపకరించే గ్రంధమని తెలుగు పండితులు గరుడాద్రి వనజ కుమారి అన్నారు. విద్యాప్రకాశానందగిరి స్వామి గీతా ప్రచార సంఘం అధ్యక్షులు గీతారత్న పురస్కార గ్రహీత డి.వి.రమణ ఆధ్వర్యంలో కర్నూలు నగరం, సంకల్భాగ్ లోని గీతాప్రచార ధామం నందు “రమ ఏకాదశి” సందర్భంగా నిర్వహించిన భగవద్గీత సంపూర్ణ పారాయణ యజ్ఞం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు భగవద్గీతపై ప్రవచించారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం కార్యవర్గ సభ్యులు సింహాద్రి రమేష్, ఇల్లూరి రమణ, జగన్నాధ గుప్తా మహా బలేశ్, విష్ణు సహస్రనామ సంఘం అధ్యక్షులు పుల్లారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డితో పాటు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భక్తులందరికీ ఏకాదశి మహాప్రసాదం అందించారు.