PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భగవద్గీత జీవనగీత

1 min read

గీతను ఆశ్రయించి సకల శాస్త్రాలు ఆధారపడి ఉన్నాయి

అత్యంత భక్తిశ్రద్ధలతో సంపూర్ణ భగవద్గీత పారాయణం.డి.వి.రమణ గీతి ప్రచార సంఘం అధ్యక్షులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  భగవద్గీతను ఆశ్రయించుకుని సకల శాస్త్రాలు ఉన్నాయని, గీతను అధ్యయనం చేస్తే సకల శాస్త్రాలు అధ్యయనం చేసినట్లు అవుతుందని శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డి.వి.రమణ అన్నారు. కర్నూలు పట్టణం, ఎన్.ఆర్.పేట, సంకల్భాగ్ లో వెలసిఉన్న శ్రీ గీతా ప్రచార ధామం నందు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులందరితో కలిసి సామూహికంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా వారు భగవద్గీత ప్రాశస్త్యాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కళ్ళే వేణుగోపాల్ శర్మ మాట్లాడుతూ మానవ జీవితం పరమార్థం తెలుసుకోవాలంటే మానవుడిగా జన్మించిన ప్రతి వ్యక్తి భగవద్గీత చదివి తీరాలన్నారు. భగవద్గీత భగవంతుని అమృత వాణి అని, అది సాటి లేని సంపద అన్నారు. జీవితం పరిపూర్ణత్వం చెందాలంటే భగవద్గీతను ఆశ్రయించాలని రచయిత్రి, తరిగొండ వెంగమాంబ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు పసుపులేటి నీలిమ అన్నారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం కార్యదర్శులు సింహాద్రి రమేష్, ఎస్ రమేష్, ఇల్లూరి రమణ, మహాబలేష్, జగదీష్ , అనిల్,టి.నారాటి. నారాయణ,  తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author