ఈనెల 17 నుండి 23 వరకు భాగవత సప్తాహం
1 min readసాయంత్రం భాగవతాన్ని పల్లకిలో ఊరేగింపు
కార్యక్రమాన్ని ప్రారంబించనున్న జిల్లా విశ్రాంత న్యాయమూర్తి కాశీభట్ల శివప్రసాద్
పల్లెవెలుగు వెబ్ ఆళ్లగడ్డ: ఆళ్ళగడ్డలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం (శ్రీఅమృతలింగేశ్వర స్వామి దేవస్థానం) నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆళ్ళగడ్డలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం నందు (అమృతలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, శివాలయం) పోతన మహాకవి విరచితమైన శ్రీమద్భాగవతంపై విశ్రాంత తెలుగు అధ్యాపకులు, గండపెండేర సత్కార గ్రహీత, సరసకవి, ఉపన్యాస కోకిల, డాక్టర్ వైష్ణవ వేంకట రమణ మూర్తిచే మంగళవారం నుండి సోమవారం వరకు శ్రీమద్భాగవత ప్రవచన సప్తాహం ఏర్పాటు చేసినట్లు, సాయంత్రం 5-00 గంటలకు ఆర్.టి.సి.బస్టాండ్ సమీపంలోని శ్రీ రామాలయం నుండి శివాలయంలోని వేదిక వరకు భాగవతమును పల్లకీలో ఊరేగింపుతో భజన మండళ్ళచే శోభాయాత్ర ఏర్పాటు చేసినట్లు, ఈకార్యక్రమాన్ని జిల్లా విశ్రాంత న్యాయమూర్తి శ్రీ కాశీభట్ల శివప్రసాద్ ప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు టి.వి. వీరాంజనేయరావు తెలిపారు. ఇందుకు సంబందించిన కరపత్రాలను స్థానిక భక్త సమాజంతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ ఎస్.మల్లేశ్వర రెడ్డి, అర్చకులు రాజేష్ శర్మ, భక్త సమాజం సభ్యులు జనార్ధన్, రాధాకృష్ణమూర్తి, రామనాథ రెడ్డి, పుష్పాబాయ్, లక్ష్మీ, శ్రీదేవి, ప్రసన్న, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనవలసినదిగా విజ్ఞప్తి చేశారు.