విద్యుత్ చార్జీలపై భగ్గుమన్న వైసీపీ..
1 min readఎన్నికల అనంతరం ఏ ఒక్క హామీ లేదు
పేదలపై విద్యుత్ ఛార్జీలు దారుణం
నందికొట్కూర్ లో ధర్నా విజయవంతం
ప్రజల పక్షాన పోరాడుతాం: ఇన్చార్జి డాక్టర్ సుధీర్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలు అంటూ అంతా హడావుడి చేశారే తప్పా పథకాల అమలులో ఏమీ లేదని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ అన్నారు.వైసీపీ పార్టీ పిలుపు మేరకు డాక్టర్ దారా సుధీర్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శుక్రవారం పోరుబాట విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టిన ధర్నా విజయవంతం అయింది.పటేల్ సెంటర్ నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు భారీ కార్యకర్తలతో ర్యాలీ చేపట్టారు.ర్యాలీ అనంతరం విద్యుత్ శాఖ డీఈఈ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే విద్యుత్ చార్జీలు పెంచి సామాన్య ప్రజలపై చార్జీలు పెంచడం దారుణమనిఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ అంతా హడావిడి చేశారు కానీ ఎన్నికల అనంతరం ఐదు నెలలు దాటినా కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన ఆ ప్రభుత్వంపై మండిపడ్డారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అదే విధంగా పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని లేకపోతే ప్రజల పక్షాన ప్రభుత్వంపై వైసీపీ పోరాడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు పోచా జగదీశ్వరరెడ్డి,సోముల సుధాకర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు మన్సూర్,ప్రచార కమిటి జిల్లా అధ్యక్షులు కొకిల రమణారెడ్డి,మాజీ జడ్పీటీసీ నాగిరెడ్డి,నాగార్జున రెడ్డి,తువ్వా లోకేశ్వరరెడ్డి,కృష్ణారెడ్డి,సుధాకర్ రెడ్డి,తిరుమల్ రెడ్డి,రమేష్ నాయుడు,చంద్రారెడ్డి,కౌన్సిలర్ నాయబ్,మాధురి,జబ్బార్, అబూబక్కర్, సులోచనమ్మ, ఎంపీటీసీలు,సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.