భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
1 min readకర్నూలు జిల్లా కురువ సంఘం……
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ సిఎం చంద్రబాబు నాయుడు కి వినతిపత్రం పంపినట్లు కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. కనకదాస్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వమే నిర్వహించాలి అలాగే మండల కేంద్రంలో కూడా అధికారికంగా నిర్వహించాలి. రాష్ట్రంలో 35 లక్షల ఓటర్లు ఉన్న కురువ కులస్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన పట్టణాల్లో తిరుపతి, శ్రీశైలం, మహానంది, విజయవాడ, విశాఖపట్నం ముఖ్య పట్టణంలో కనకదాసు భవనాలను నిర్మించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు కొత్తపల్లి దేవేంద్ర, జిల్లా కోశాధికారి కెసి నాగన్న, పెద్దపాడు ధనుంజయ, బి.సి. తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.