సమాజంలో మార్పు కోసం భక్త కనకదాస చేసిన కృషి మరువలేనిది.. రాష్ట్ర మంత్రి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు భక్త కనకదాస చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. కనకదాస జయంతి సందర్భంగా అమరావతిలోని అసెంబ్లీ హాలులో ఆయన చిత్రపటానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి టి.జి భరత్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో జన్మించిన గురు కనకదాస రాయలసీమలోనూ కుల వ్యవస్థ, అసమానతలపై చైతన్యం తీసుకొచ్చారని చెప్పారు. భక్తి మార్గంలో ఆయన చేసిన బోధనలు నేటికీ అనుసరణీయమన్నారు. గొప్ప వ్యక్తుల జీవితచరిత్రను నేటి తరం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.