జిల్లా ప్రజలకు భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు.. జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా శుభాకాంక్షలు తెలియజేశారు.సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో తులతూగుతూ ఉండాలని, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.. సంక్రాంతి పండుగను మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు సంక్రాంతి పండుగను పొంగలి, పిండివంటలతో, పితృ దేవతలు, దేవుళ్ల పూజలతో, మూడవ రోజు కనుమ పండుగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని, ప్రజలందరికీ మంచి జరగాలని జిల్లా కలెక్టర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.