PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెద్ద సారోళ్లు..ఓసారీ నా వైపు చూడరూ: రోడ్లు

1 min read

ఓర్వకల్లు రోడ్డుకు మోక్షం మెన్నడో

పల్లెల్లో గుంతల రోడ్లు..ప్రమాదాల బారిన వాహన చోదకులు 

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోడ్లు గుంతలు గుంతలు గా ఉండడంతో చినుకు పడితే చాలు వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని కడుమూరు- 49 బన్నూరు..మిడుతూరు పీరు సాహెబ్ పేట..పైపాలెం- కడుమూరు..దేవనూరు- సున్నంపల్లి..గుడిపాడు మరియు ఓర్వకల్లు మండలానికి రోడ్డు వేయాలని అంతే కాకుండా రోడ్లు గుంతలు గుంతలుగా ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు వాహన చోధకులు..ఆటోలు ద్విచక్ర వాహనదారులు క్రిందపడి గాయాలతో ఆస్పత్రుల పాలు అవుతున్నామని ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నో ఏళ్ల క్రితం వేసిన రోడ్లు ఉన్నాయని కనీసం రోడ్లను ఏ విధంగా ఉన్నాయోనని చూడాల్సిన బాధ్యత వారిపై లేదా అంటూ వివిధ గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.చినుకు పడితే చాలు గుంతలల్లో వర్షం నీళ్లు నిల్వ ఉండటం వల్ల వాహనాలు ఎదురు పడితే వెళ్ళటానికి ఇబ్బందికరంగా ఉందని వాహనాలు రోడ్డు పక్కన కూరుకు పోతున్నాయని రాత్రి సమయాల్లో అయితే ఏకంగా క్రింద పడడం ప్రమాదాల బారిన పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు పల్లె గ్రామాల్లో రహదారులపై దృష్టి సారించి రోడ్లు వేయించాలని వివిధ గ్రామాల ప్రజలు మరియు వాహన చోదకులు కోరుతున్నారు.నందికొట్కూరు నుండి ఓర్వకల్లుకు వెళ్లడానికి రోడ్డు అద్వానంగా ఉంది బేతంచెర్ల,బనగానపల్లి, కోయిలకుంట్ల మరియు తదితర ప్రాంతాలకు వెళ్లడానికి భారీ వాహనాలు ప్రయాణికులు రోడ్డు మార్గాన్నే వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అంతేకాదు ఓర్వకల్లు లోనే విమానాశ్రయం ఉందని మరి ఈ రోడ్డును ఎంతో నందనవనంగా చేయించాల్సిన ప్రజా ప్రతినిధులు అధికారులు వీటిపై కన్నెత్తి చూడకపోవడం గమనార్హం..పైపాలెం- కడుమూరు గ్రామ రోడ్డుకు గత సంవత్సరమే నిధులు మంజూరై నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడం విడ్డూరకరంగా ఉందని ఈ గ్రామాల ప్రజలు వాపోతున్నారు.బన్నూరు ఎస్సీ కాలనీ రహదారి మరియు చౌటుకూరు ఆటో స్టాండ్ ప్రధాన రహదారి అధ్వాన్నం గ్రామ నడిబజార్లలో రోడ్లును చెడగొట్టి రోడ్లు వేయకుండా ఉండడం వల్ల భారీ వాహనాల తిరగడంతో ఇళ్లల్లోకి దుమ్ము వస్తోందని వర్షాకాలంలో చినుకు పడితే భారీ బురద ఉండడంతో వాహన చోధకులు కింద పడుతున్నారని ఎన్నో సంవత్సరాలుగా అధికారులకు ప్రజా ప్రతినిధులకు విన్నవించు కున్నా ఫలితం లేదని గ్రామాల ప్రజలు అంటూ ఉన్నారు.

About Author