PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్యాపిలీ లో పెద్ద సరిగేత్తు వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలీ పట్టణంలో మొహరం పండుగ సందర్భంగా పురస్కరించుకొని మంగళవారం పెద్ద సరిగేత్తు వేడుకలు దస్తాగిరి స్వామి, పెద్ద గుడ్డురళ్ల స్వామి, లాల్ స్వామి,ఖాజ బందనావాజ్ స్వాములను భక్తులు భర్తీశ్రద్ధలతో  మొక్కులు నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం భక్తులు తన మొక్కుబడి తీర్చుకునేందుకు చక్కెర, కొబ్బెర, పప్పు లు, వెండి ఆభరణాలు పూలమాలతో మేల వాయిద్యాలతో స్వామి దగ్గరికి వెళ్లి కానుకలు సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. ఈ పెద్ద సరిగేత్తు సందర్భంగా పట్టణంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో మైన్ బజార్ అంతా కిక్కిరిసిపోయింది. ఈ రాత్రి అంతా భక్తులు పీర్ల సాగుల దగ్గరనే ఉంటూ స్వాముల కలయికను తిలకిస్తూ ఉంటారు.

About Author