రామనపల్లెలో వైభవోపేతంగా బిందెసేవ కార్యక్రమం
1 min readరామనపల్లె పురవీధులలో అమ్మవారి బింద సేవ గ్రామోత్సవం
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మండలంలోని రామనపల్లె గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో బుధవారం ఏడవ రోజు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున గణపతి పూజ, అభిషేకాలు, కుంకుమార్చన తో పాటు ప్రత్యేక అభిషేకం పూజలు, అలంకరణలు అలాగే గ్రామంలోని పురవీధుల గుండా బింద సేవ మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం ఆలయ నిర్వాహకులు నిర్వహించడం జరిగింది.. సాయంత్రం ఆరున్నర గంటలకు అమ్మవారికి భక్తులు, సరస్వతి పూజ ( కుంకుమార్చన ) కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమతో పాటు కాయ కర్పూరం అందజేసి అమ్మవారిని మ్రొక్కుకోవడం జరిగింది.అలంకారం ఉభయ దారులు ప్రసాద ఉభయ దారులు ఇండ్ల వద్ద నుంచి మేళ తాళాలతో అమ్మవారి సంకీర్తనలు పాడుతూ అమ్మవారి ఆలయం వరకు తీసుకురావడం జరిగింది. దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.