PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రీ సూర్యనారాయణ దేవాలయం. (కర్నూలు) దత్తపీఠము (26-05-2024@ ఆదివారము) అవధూత దత్త పీఠాధిపతులు, జగద్గురువులు పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి జన్మదినం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయము నందు ఉదయం శ్రీ సద్గురు స్వామీజీ వారి పాదుకలకు సుగంధ ద్రవ్య జలాభిషేకము, పంచామృతాభిషేకము, అర్చన, మహా మంగళహారతి, మంత్రపుష్పము నిర్వహించడం  జరిగినది. అనంతరం 11.00 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి హోమము, మృత్యుంజయ హోమము, ఆయుష్య హోమము, శ్రీ ఆదిత్య హృదయ హోమము, మహా పూర్ణాహుతి జరిగినది. ఇందులో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయినారు.

About Author