PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వృద్ధుల సమక్షంలో.. పుట్టినరోజు వేడుకలు..

1 min read

ముర్తుజావలి ఆధ్వర్యంలో  వృద్ధులకు అన్నదాన కార్యక్రమం

శివానందరెడ్డి అభివృద్ధి ప్రదాత ప్రజానాయకుడు

టిడిపి పట్టణ మహిళా నాయకులు డాక్టర్ వనజ

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని జువ్వాజీ సుంకన్న గౌడ్ సేవా సమితి వృద్ధాశ్రమంలో నంద్యాల పార్లమెంటు టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి పుట్టినరోజు సందర్భంగా పట్టణ టిడిపి క్లస్టర్ ఇంచార్జి ఎస్ మూర్తుజావలి ఆధ్వర్యంలో శుక్రవారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.పుట్టినరోజు సందర్భంగా గత రెండు రోజులుగా వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముర్తుజావలి, టిడిపి పట్టణ మహిళా నాయకులు డాక్టర్ వనజ మరియు మాల మహానాడు సీనియర్ నాయకులు డాక్టర్ రాజు మాట్లాడుతూ గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాన్ని శివానందరెడ్డి అభివృద్ధి చేశారని ఇప్పుడు కూడా అదే రీతిలో నియోజకవర్గ అభివృద్ధి కోసం శివానందరెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో గెలుపుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదని అన్నారు.అదేవిధంగా రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు.వృద్ధుల సమయంలో   పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అంతేకాకుండా శివానందరెడ్డి కొరకు దేవుడు ఆయనను దీవించాలని మీరు దేవుడిని ప్రార్థించాలని వారు వృద్ధులను కోరారు.ప్రజల మనిషి ప్రజా నాయకుడిగా నియోజకవర్గ ప్రజలకు ఆయన సేవలు అందించుటకు దేవుడు ఆయనకు తోడుగా ఉండాలని డాక్టర్ డి వనజ అన్నారు. ముందుగా శివానందరెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయించారు.ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, నవనంది పాఠశాల కరస్పాండెంట్ శ్రీధర్,పట్టణ యువత అధ్యక్షులు ప్రభు కుమార్,హుస్సేన్,మట్ట మరియు వృద్ధులు పాల్గొన్నారు.

About Author