PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

28వ డివిజన్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

1 min read

ప్రారంభించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు స్థానిక 28వ డివిజన్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. డివిజన్ ఇంచార్జ్ జొన్నలగడ్డ సుజాత, వెంకట ఆనంద్ దంపతుల ఆధ్వర్యంలో సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా ఆయన అభిమానులు నిర్వహిస్తున్నారన్నరు. డివిజన్ ఇన్చార్జి సుజాత మాట్లాడుతూ తామంతా పవన్ కళ్యాణ్ అభిమానులమని, ఆయన ఎన్నో ప్రజా సంక్షేమా, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన అడుగుజాడల్లో తామంతా పయనిస్తామన్నారు. పవన్ జన్మదిన వేడుకలు జరపడం ఇది రెండోసారి అన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్ బాబు, జనసేన కార్యకర్తలు రాజేష్ , గణేషు, పూర్ణ, హుస్సేన్, శ్యామల, ఉమా దుర్గా, నందిని, మరియు డివిజన్ జనసేన కార్యకర్తలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About Author