PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో సోమవారం నాడు జన సైనికులు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింత సురేష్, మండల నాయకులు ధరణి చంద్ర, మహమ్మద్ రఫీలు, గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి, కార్యకర్తలు జన సైనికులతో కలిసి గడివేముల సినిమా థియేటర్ దగ్గర నుండి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జనసేన టిడిపి కార్యకర్తలు సమక్షంలో కేకును కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు సుబ్బయ్య, మంజునాథ్, చంద్రమోహన్, మహమ్మద్ రఫీ జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

About Author