టీడీపీ ప్రభుత్వాన్ని దీవించండి : బైరెడ్డి
1 min readపింఛన్లను అందజేసిన ఎంపీ శబరి..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: తెలుగుదేశం పార్టీని దీవించాలని నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పింఛన్ దారులతో అన్నారు.నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్దారుల ఇండ్ల వద్దకు వెళ్లి పింఛన్లను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని నూతన ఏడాదికి ముందే ఒకరోజు పింఛన్లను అందజేయడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమని అన్నారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రహదారిలో 24వ వార్డు బైరెడ్డి నగర్ లో పింఛన్లను మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముందు రోజే పింఛన్లను పంపిణీ చేయడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం నింపిన విజనరీ సీఎం చంద్రబాబు అని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చాంద్ బాష,లాలు ప్రసాద్, శంకర్,జూపాడుబంగ్లా నాగేశ్వరరావు,సీఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.