PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాగ్రత్తలతో… ‘రక్తపోటు’ కంట్రోల్​..

1 min read

ఒత్తిడితోనే.. హైపర్​ టెన్షన్​..

  •  హార్ట్​ ఎటాక్​ , మెదడు స్ర్టోక్​ వచ్చే ప్రమాదం..
  • పోషక ఆహారం.. వ్యాయామంతో కొంత నియంత్రణ
  •  ప్రముఖ కార్డియాలజిస్ట్​, ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​

కర్నూలు, పల్లెవెలుగు: హార్ట్​ ఎటాక్​, మెదడు స్ట్రోక్​  తదితర ఆరోగ్య సమస్యలతో వచ్చే వారిలో అధికంగా రక్తపోటు కారణంగానే మృత్యువాత పడుతున్నారని,  ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రముఖ కార్డియాలజిస్ట్​, ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​. ఆదివారం స్థానిక ఏ క్యాంపులోని ‘ కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ నేతృత్వంలో ఫౌండేషన్​ ప్రధాన కార్యదర్శి, సీనియర్​ కార్డియాలజిస్ట్​, ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ ‘ హైపర్​ టెన్షన్​ ’పై మెడికల్​ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్​ మాట్లాడుతూ గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులలో వ్యతిరేక రక్త ప్రసరణ కారణంగా ఒత్తిడి అధికమవుతుందని, దీని వల్ల గుండె నొప్పి, హార్ట్​ ఎటాక్​, మెదడు స్ర్టోక్​ , ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో హార్ట్​ ఎటాక్​, మెదడు స్ర్టోక్​తో చనిపోయే వారు అధికంగా హైపర్​ టెన్షన్​ ( అధిక ఒత్తిడి ) కారణంగానే మృతి చెందుతున్నారని, ఇది తెలుసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అధిక రక్తపోటును సైలెంట్​ కిల్లర్​ గా చెబుతారు. సాధారణ వ్యక్తులకు 120/80 ఎంఎంహెచ్​జి ఉంటుంది. బీపీ, షుగర్​ వ్యాధిగ్రస్తులకు 130/80 ఉంటే రక్తపోటు ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తారని, అటువంటి వారు నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్​ వెల్లడించారు.

 రక్త పోటు లక్షణాలు:

  • తీవ్రమైన తలనొప్పి
  • ముక్కులేని
  • అలసట
  • మసక దృష్టి
  • ఛాతి నొప్పి
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • సక్రమంగా లేని హృదయ స్పందన

అధిక రక్తపోటుకు కారణాలు :

  • ధూమపానం
  • అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం
  • శారీరక శ్రమ లేకపోవడం
  • ఆహారంలో ఎక్కువ ఉప్పు
  • అధికంగా మద్యం సేవించడం
  • ఒత్తిడి
  • అడ్రినల్ మరియు థైరాయిడ్ రుగ్మతలు
  • స్లీప్ అప్నియా

ఇలా చేస్తే.. కంట్రోల్​..:

 ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ధూమపానం, ఆల్కహాల్​ అధికంగా తీసుకోరాదు.  పోషక ఆహారం, బరువు ను ఎప్పటికప్పుడు చెక్​ చేసుకుని, కంట్రోల్ చేసుకోవడం,  ఒత్తిడికి దూరంగా ఉండటం వల్ల రక్తపోటు ను నియంత్రించవచ్చని ప్రముఖ కార్డియాలజిస్ట్​ , ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ స్పష్టం చేశారు.

డా. చంద్రశేఖర్​ కు ఘన సన్మానం:

కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ నేతృత్వంలో విద్యార్థులకు, ప్రజలకు  ఎంతో మంది వైద్య నిపుణులతో అవగాహన సదస్సులు నిర్వహించి…నగర ప్రజల మన్ననలు పొందుతున్న ప్రముఖ కార్డియాలజిస్ట్​ , ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ ను  సంస్థ గౌరవాధ్యక్షుడు డా. భవాని ప్రసాద్​, సభ్యులు చంద్రశేఖర్​ కల్కూర తదితరులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్​ గౌరవాధ్యక్షుడు డా. భవాని ప్రసాద్​ మాట్లాడుతూ జీజీహెచ్​ సూపరింటెండెంట్​గా, మెడికల్​ కళాశాల  ప్రిన్సిపల్​ గా, కార్డియాలజిస్ట్​ వైద్య నిపుణులుగా ప్రజలకు ఎంతో సేవలు అందించిన డా. చంద్రశేఖర్​ … మెడికల్​ విద్యార్థులకు వివిధ వ్యాధులపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. హార్ట్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా డా. భవాని ప్రసాద్​ ఆకాంక్షించారు.

About Author