11 మంది తల సేమియా చెన్నారులకు రక్తమార్పిడి
1 min readప్రతి సంవత్సరం సుమారు 40 తల సేమియా సికిల్ సెల్ కేసులు
జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి
సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా సహాయకులకు భోజన సదుపాయం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నా రెడ్ క్రాస్ తల సేమియా భవనంలో 11 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి చికిత్స నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సుమారు 40 తల సేమియా, సికిల్ సెల్ కేసులు రెడ్ క్రాస్ లో నమోదు అవుతున్నాయని. తల్లిదండ్రులలోని జన్యుపరమైన లోపాల కారణంగా ఈ వ్యాధులు వస్తున్నాయని అన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి తల సేమియా వ్యాధి రెండు సంవత్సరాలలోపు పిల్లల్లో ఎక్కువగా బయటపడుతుందని, తల్లిదండ్రులు లక్షణాలను బట్టి ముందుగా గుర్తించి చికిత్స పొందాలని కోరారు. ఈరోజు తల సేమియా చిన్నారులతో పాటు వారి సహాయకులకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అడుసుమిల్లి సత్యనారాయణ భోజనాలను, ఏలూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎన్జీవీబీ స్వామి పండ్లను పంపిణీ చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీసీతారాం, డాక్టర్ వరప్రసాదరావు, ట్రెజరర్ రేవూరి శివప్రసాద్, డాక్టర్ జి స్పందన, ఏలూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎన్ జి వి బి స్వామి, కార్యదర్శి బి. ప్రసాద్, పిఆర్ఓ కెవి రమణ తదితరులు పాల్గొన్నారు.