ఏలూరు జిజిహెచ్లో 12 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి
1 min readచికిత్స నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు సర్వేన ఆసుపత్రి ప్రాంగణంలో తల సేమియా చిన్నారులకు భక్త మార్పిడి చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ 12 మంది తలసేమియా చిన్నారులకు క్రమం తప్పకుండా రక్తమార్పిడి చేయడానికి రక్తదాతల సహకారం మరువలేనిదని అన్నారు. ప్రస్తుతం ప్రజల్లో రక్తదానంపై అవగాహన పెరుగుతుందని అన్నారు. తల సేమియా చిన్నారులకు వారి సహాయకులకు 30 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు కాట్రగడ్డ సయాజి రావు కి అభినందనలు తెలిపారు. రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ 114వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కృష్ణారెడ్డి మరియు రెడ్ క్రాస్ సిబ్బంది నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీ సీతారాం, డాక్టర్ వరప్రసాదరావు, డాక్టర్ జి స్పందన, ఏలూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎన్జీవిబీ స్వామి, కార్యదర్శి బి ప్రసాద్, పి ఆర్ ఓ కెవి రమణ తదితరులు పాల్గొన్నారు.