PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

13 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి

1 min read

రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో సరిపడా రక్త యూనిట్లు ఉన్నాయి

చైర్మన్ బి.వి కృష్ణారెడ్డి

భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు

పార్థసారథి,ఉషారాణి దంపతులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తల సేమియా కేంద్రంలో 13 మంది తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి చికిత్స నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ లో సరిపడా రక్త యూనిట్లు అందుబాటులో ఉన్నాయని,  క్రమం తప్పకుండా తల సేమియా, సికిల్ సెల్ అనీమియా చిన్నారులకు రక్తమార్పిడి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో తల సేమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు తల సేమియా చిన్నారులకు వారి సహాయకులకు 30 మందికి ఉచిత భోజనాన్ని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు ఇ. పార్థసారథి, ఉషారాణి దంపతులు ఏర్పాటు చేశారని, పండ్లు మరియు ప్రోటీన్ పౌడర్ ఏలూరు రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఎన్జివిబి స్వామి, పంపిణీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీ సీతారాం, డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కే వరప్రసాదరావు, ఆర్ఎన్ఆర్ బుజ్జి, బి ఆర్ సి హెచ్ నారాయణ, డాక్టర్ జి స్పందన, ఈ పార్థసారథి, ఉషారాణి, ఏలూరు రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఎన్జీవీబీ స్వామి, కడియాల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

About Author