15 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి
1 min readసీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు
సహకరించిన దాతలకు చైర్మన్ బివి కృష్ణారెడ్డి కృతజ్ఞతలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తల సేమియా భవనంలో 15 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి చికిత్స నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి చిన్నారులకు రక్త మార్పిడి చికిత్స, మందులతో పాటు పౌష్టికాహారం కూడా ముఖ్యమని అన్నారు. ఈరోజు తల సేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు 35 మందికి మధ్యాహ్నం భోజనాన్ని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు మోపిదేవి శంకర్రావు, ప్రోటీన్ పౌడర్లను ఏలూరు రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఎన్జివిబి స్వామి ఏర్పాటు చేశారని, ఈ సందర్భంగా వారికి కృష్ణారెడ్డి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కే వరప్రసాదరావు, ఏలూరు రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఎన్జీవి బి స్వామి, కార్యదర్శి బి ప్రసాద్, మోపిదేవి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.