PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

9మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి

1 min read

యువత రక్తదానానికి ముందుకు రావాలి

అధునాతన పరికరాలతో ఏసీ మొబైల్ బ్లడ్ కలెక్షన్ బస్సు ఏర్పాటు

రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తల సేమియా భవనంలో 9 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడిని నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తల సేమియా, సికిల్ సెల్ ఎనీమియా చిన్నారుల కోసం ఉత్సాహవంతమైన యువకుల నుంచి రక్తాన్ని సేకరించడానికి జిల్లాలో ఉన్న డిగ్రీ, పిజి కళాశాలల వద్ద అధునాతన పరికరాలతో కూడిన ఏసీ మొబైల్ బ్లడ్ కలెక్షన్ బస్సును పెడుతున్నామని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి తల సేమియా చిన్నారులను ఆదుకోవాలని కోరారు. ఈరోజు తల సేమియా చిన్నారులు, వారి సహాయకులకు 25 మందికి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు అడుసుమిల్లి సత్యనారాయణ, పండ్లను కె.రామ్ శ్రీ భాస్కర్, మోతే అనుపమాలు పంపిణీ చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కేబి సీతారాం, డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కే వరప్రసాదరావు, బి ఆర్ సి హెచ్ నారాయణ, డాక్టర్ జి.స్పందన, లయన్స్ డిస్టిక్ ఉమెన్ లీడర్ కె. పద్మావతి, లయన్స్ గైనర్కి క్లబ్ ప్రెసిడెంట్ ఎం.అనుపమ, కె రామ్ శ్రీ భాస్కర్, కెవి రమణ తదితరులు పాల్గొన్నారు.

About Author