చంద్రబాబునాయుడు కి ధన్యవాదాలు తెలిపిన బొజ్జా దశరథరామిరెడ్డి
1 min readకర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకై ఉత్తర్వులు..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా మౌలిక వసతుల కల్పన కొరకు, హైకోర్టు శాశ్వత భవనాలకు కావలసిన భూమి ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి హర్షం వెలుబుచ్చారు. శుక్రవారం నంద్యాల సమితి కార్యాలయంలో ప్రభుత్వ ఉత్తర్వులను స్వాగతిస్తూ దశరథరామిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేసారు. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాచరణ చేపట్టడం పట్ల చంద్రబాబునాయుడు కి, న్యాయశాఖామాత్యులు ఎన్ఎండి ఫరూఖ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే కర్నూలులో ఏర్పాటు చేసిన విద్యుత్ నియంత్రణ మండలి, ఏర్పాటు చేయదలచిన జాతీయ లా యూనివర్శిటీలను కర్నూలులోనే కొనసాగేటట్లుగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రాయలసీమ ప్రాజెక్టులకు సక్రమ నీటి నిర్వహణ కొరకు క్రిష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయంను కర్నూలులో ఏర్పాటు చేసి రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రికి దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.