PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాల ఉత్పత్తిదారులకు బోనస్ పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : మండల కేంద్రమైన గడివేములలో విజయ పాల డైరీ లో శనివారం నాడు విజయ పాల డైరీ సొసైటీ అధ్యక్షులు బావిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో విజయ పాల డైరీ సూపర్వైజర్ మధుసూదన్ రెడ్డి పాల ఉత్పత్తిదారులకు బోనస్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి జనవరి నుండి డిసెంబర్ వరకు పాల ఉత్పత్తిదారులకు లీటర్ పై రూపాయిన్నర చొప్పున బోనస్ ను అందజేస్తున్నామన్నారు. గడివేములలో మొత్తం 20 మంది పాల ఉత్పత్తిదారులకు గాను 42 వేల 157 రూపాయలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మిల్క్ కలెక్షన్ ఏజెంట్ నారాయణ మరియు పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.

About Author