మహాకవి శ్రీశ్రీ అంతరాత్మ పుస్తకావిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ స్థానిక శాఖ గ్రంధాలయం లో కమలా కళా నికేతన్ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పుస్తకావిష్కరణ సభ జరిగింది.అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ అధ్యక్షతన కవి రచయిత సవ్వప్ప ఈరన్న రచించిన పుస్తకం “మహాకవి శ్రీశ్రీ అంతరాత్మ ” అనే పుస్తకాన్ని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కాటం ప్రకాష్ ఆవిష్కరించారు.మొదట రిటైర్డ్ రెవెన్యూ అధికారి పద్మనాభ మూర్తి జ్యోతి ప్రజ్వలన చేయగా,తెలుగు ఉపాద్యాయులు హోసూరు వెంకటేష్ యాదవ్ పుస్తకాన్ని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, సాంప్రదాయ సాహిత్యాన్ని మలుపు తిప్పిన మహా కవి శ్రీ శ్రీ అన్నారు.తనసాహిత్యంలో కష్టజీవుల కన్నీళ్లను,ఈతి బాధలను, వారిబతుకులను, వ్యధలను కళ్ళకు కట్టినట్లు రచించారని తెలిపారు. సాహిత్యం సమాజ హితాన్ని కోరుకుంటుందని, అభ్యుదయ భావాలతో కవిత్వo రాసిన మహా కవి శ్రీ శ్రీ అని కొనియాడారు.అలాంటి మహా కవి శ్రీ శ్రీ గురించి రాయడం వలన కవి సవప్ప ఈరన్న జన్మ సార్థకం అయ్యిందని అన్నారు.ఇది ఆయన యొక్క 70 వ పుస్తకం అన్నారు.ఈరన్న 100 పుస్తకాలు రాసి మన జిల్లాకే వన్నె తెస్తారని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమలో పురోహితులు మురళీ కృష్ణ,రంగన్న,లైబ్రేరియన్ రాంకుమార్,మురళీ,విశ్వనాథ్ రెడ్డి,నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.