మృతి చెందిన కుటుంబానికి బూషి గౌడ్ చేయూత..
1 min readయజమాని మృతితో కుటుంబంలో విషాద ఛాయలు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన బుడగ జంగం గోపాల్,సాలమ్మ కుమారుడు బుడగ జంగం తూర్పాటి భూపాల్(40) గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు భూపాల్ శుక్రవారం సా 6 గం.ల సమయంలో భూపాల్ కు గుండె నొప్పి రావడంతో నందికొట్కూరు ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వారు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామటీడీపీ సీనియర్ నాయకులు ఎన్.భూషిగౌడ్ నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదేశాల మేరకు భూషిగౌడు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.మృతునికి భార్య సుంకమ్మ,పెద్దులమ్మ,రామ్ చరణ్,కావేరి సంతానం ఉన్నారు.కుటుంబ యజమాని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మరియు బంధు మిత్రుల రోదనలు మిన్నంటాయి.