బోరింగ్ ని వీలైనంత తొందరగా మరమ్మతులు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: 7వార్డులో గత కొన్ని రోజులుగా జమాపూర్ కాంప్లెక్సు ఎదురుగా ఉన్న బోరింగ్ పనిచెయ్యడం లేదు, ఈ బోరింగ్ వీలైనంత తొందరగా సరిచెయ్యాలని గౌరవనీయులైన గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ కు మనవి.మా కాలనీలో జమ్మాపురం కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బోరింగ్ గత ఇరవై రోజులుగా పనిచెయ్యడం లేదు,అందువలన కాలనీ వాసులకు నీరు సమస్యగా మారింది.మా కాలనీలో కొళాయి నీళ్ళు వారానికి ఒక్కసారే వస్తాయి,అలాగే ఈ కాలనీ లో రైతులు ఎక్కువగా ఉండడం వలన ప్రతిరోజూ పశూవులకు త్రాగడానికి నీళ్ళు ఉండవు కాబట్టి ఆ బోరింగ్ పైన ఆధారపడి ఉన్నారు.అందువలన వెంటనే బోరింగ్ లో వెంటనే మోటార్ దింపి బోర్ కనెక్షన్ ఇవ్వాలని కోరారు.అదేవిధంగా రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బోరును కొళాయి పైపులైను కలెక్షన్ ఇవ్వాలని వలన కొంతమేరకు నీటి సమస్యను పరిష్కరించవచ్చు, అందువలన వెంటనే కనెక్షన్ ఇవ్వాలని కాలనీ వాసులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ డి పి ఐ బ్రాంచ్ కమిటీ సభ్యులు బి, అల్లాబకాస్, కే, అబూబకర్, కే, జావీద్, బి, రహమతుల్లా, ఎస్ డి పి ఐ కార్యకర్తలు కాలనీవాసులు పాల్గొన్నారు.