బ్రహ్మంగారి వాక్కు ఫలించింది
1 min readమన గ్రామానికి మంచి రోజులు వచ్చాయి
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: క్షీరం మంటే పాలు, పాలని లక్ష్మీదేవి తో మన హిందూ సాంప్రదాయంగా భావిస్తాము అలాంటిది,వేప చెట్టు కు పాలు కారడం మన గ్రామకి లక్ష్మీదేవి కనికరించిందని అర్థం పట్టణ ప్రజలు వీటిని దర్శించుకుని ముక్కులు తీర్చుకోవాలి మాజీ ఎంపీపీ తోప్పల శ్రీనివాసులు ప్యాపిలీ పట్టణంలో ఓ వింత చోటు చేసుకుంది. అదేమిటంటే వేప చెట్టుకు పాలు కారడం ఒకానొకప్పుడు వీరబ్రహ్మం స్వామి వేప చెట్టుకు పాలు కారును అను వాక్కు ఫలించిందని మన గ్రామానికి సుభచూచికమని మాజీ ఎంపీపీ తోప్పెల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక పట్టణంలోని నాగుల కట్ట లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కట్టపై ఉన్న వేప చెట్టుకు పాలు కారడం చూసేందుకు మాజీ ఎంపీపీ తోప్పుల శ్రీనివాసులు చూసి దర్శించుకుని పట్టణంలోని ప్రజలంతా దర్శించుకుని గ్రామ ప్రశాంతతను, పాడిపంటలను కొలువు తీరాలని కోరుకోవాలని ఆయన కోరారు. ఈ వింతను చూడడానికి గ్రామంలోని ప్రజలు చుట్టుముట్టు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తిలకించి, సెల్ఫోన్లతో వీడియోలు, ఫోటోలు తీసుకొని తమ బంధువులకు, స్నేహితులకు వీడియోలు పంపిస్తున్నారు.