బ్రాహ్మణులు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోండి
1 min readరాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ వెంకట రామరాజు పిలుపునిచ్చారు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర బ్రాహ్మణులందరు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికారిక కమిటీ రాష్ట్ర నాయకులు యన్. వెంకటరామరాజు కోరారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బ్రాహ్మణుల కోసం దేశం లోనే ప్రధమంగా కార్పొరేషన్ స్థాపించిన ఘనత తెలుగుదేశం పార్టీ కి దక్కుతుంది అని అయన తెలరు. సభ్యత్వం తీసుకోవడం వలన 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నందున ప్రతి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు సభ్యత్వం తీసుకోవాలని రామారాజుకోరారు. బ్రాహ్మణుల అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని వెంకటరామరాజు తెలిపారు.