అప్పుడే పుట్టిన శిశువులకు తల్లి పాలు శ్రేష్టకరం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : తల్లిపాలు బిడ్డకు శ్రేష్టకరమని పుట్టిన పిల్లలకు ఒక గంటలోపు వచ్చే పసుపు పచ్చని పాలను బిడ్డకు ఇవ్వడం వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ గుర్రమ్మ తెలిపారు, తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం చెన్నూరు- 1 తూర్పు హరిజనవాడ అంగన్వాడి సెంటర్ నందు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఐ సి డి ఎస్ సూపర్వైజర్ గురమ్మ మాట్లాడుతూ తల్లిపాల వారసువాలలో భాగంగా ఆగస్టు 1వ తేది నుండి 7వతేది వరకు మండల వ్యాప్తంగా అన్ని అంగన్వాడి కేంద్రాలలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు, ఈ సందర్భంగా ఆమె అంగన్వాడి కేంద్రంలో గల గర్బవతులకు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను గురించి తెలపడం జరిగింది, అలాగే తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి శ్రేష్టము అలాగే పుట్టిన పిల్లలకు 1గంట లోపు వచ్చే పసుపు పచ్చని పాలను బిడ్డ కు ఇవ్వడం వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందని రెండు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా తల్లిపాలన అందించవలసినదిగా ఆమె సూచించారు,అలాగే బాల్య వివాహాలను నిర్మూలించే దిశగా అడుగులు వేయమన్నారు. పిల్లలు పుట్టిన వెంటనే వారికి వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని తెలిపారుఈ కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శి చంద్రకళ, ఏఎన్ఎం జ్యోత్స్న, అంగన్వాడీ టీచర్లు,ఆశా వర్కర్ లు గర్బవతులు, బాలింతలు పాల్గొన్నారు.