PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రంలోనే నంద్యాల జిల్లాకు ప్రత్యేక గుర్తింపు స్థానం తీసుకురండి

1 min read

ఏటా 15% గ్రోత్ రేటుతో ప్రణాళికలు రూపొందించండి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: స్వర్ణాంధ్ర@2047 లో భాగంగా నంద్యాల జిల్లాను రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న నిర్దిష్ట లక్ష్యంతో అధికారులు పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో  స్థూల దేశీయోత్పత్తి, ఆదాయ వృద్ధిరేట్లపై జిల్లా అధికారులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రతి ఏడాది 15% గ్రోత్ రేట్ లక్ష్యంతో పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖలు తమ వృద్ధిరేటును ప్రతి ఏటా 15 శాతం పెంచుకుంటూ నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాష్ట్రంలోనే నంద్యాల జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు స్థానం తీసుకొచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వృద్ధిరేటు సాధించేందుకు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగాలతో పాటు విద్య, వైద్యం, ఇరిగేషన్ తదితర అన్ని రంగాలలో అభివృద్ధి నివేదికలు తయారు చేసే విధానంపై నిపుణులైన మాస్టర్లచే శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిక్షణా కారక్రమం అన్ని శాఖలకు సంబంధించి ఆదాయ, వృద్ధిరేట్లను గణించి ఖచ్చితమైన సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. తద్వారా గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి రేటును పెంచుకుంటూ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలన్నారు. గ్రామాలకు సురక్షిత మంచి నీటిని సరఫరా చేస్తే ప్రజలు ఆరోగ్యవంతులై తద్వారా జిడిపి పెరుగుదల, తద్వారా ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల సంఖ్య తగ్గితే జిడిపి పెరుగుతుందని కలెక్టర్ ఉదహరించారు.అంతకుముందు స్థూల దేశీయోత్పత్తి, ఆదాయ వృద్ధిరేట్లపై నంద్యాల మోడల్ స్కూల్ లెక్చరర్ మల్లికార్జునప్ప, బేతెంచెర్ల మోడల్ స్కూల్ లెక్చరర్ మరియాదాసులు స్పష్టమైన రీతిలో జిల్లాధికారులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు.

About Author