PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులు క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తేవాలి

1 min read

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సమాజంలోని విద్యార్థిని విద్యార్థులు క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన విద్యార్థులకు సూచించారు.శనివారం స్థానిక అవుట్ డోర్ స్టేడియంలో క్రీడాజ్యోతిని వెలిగించి ఓలంపిక్ డే కార్యక్రమాన్ని  జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, జిల్లా ఎస్పీ  కృష్ణ కాంత్. ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ… సమాజంలోని విద్యార్థిని విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి, మంచి పేరు తీసుకురావాలిఅని అన్నారు. ముఖ్యంగా క్రీడలలో మనం నేర్చుకునేది క్రమశిక్షణ, మనిషి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో తోడ్పడతాయన్నారు. విద్య మనకు ఎలా జ్ఞానాన్ని ఇచ్చి మెరుగుపరుస్తుందో అదే విధంగా క్రీడలు కూడా మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి అని అన్నారు.విద్యతో పాటు క్రీడలు కూడా మనలో భాగస్వామ్యం అయినప్పుడు పరిపూర్ణతగల మనిషిగా అభివృద్ధి చెందుతారు అనే విషయాలను పిల్లలకు నేర్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడలు మనిషి జీవితంలో దిశా నిర్దేశించుకోవడానికి క్రమశిక్షణ ఏర్పరచుకోవడాని ఒకరికొకరు బలంగా ఉండడానికి ఒక టీముగా ఉండి మనతో పాటు మన పాఠశాలలను, మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుంటాము. విద్యార్థులందరూ క్రీడలను జీవితంలో భాగంగా చేర్చుకొని అవి నేర్పించే పాఠశాలను జీవితంలో అన్వయించుకొని ఉన్న స్థాయికి ఎదిగి దేశానికి మంచి పేరు తేవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ మాట్లాడుతూ…   గతంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యకి ఇచ్చిన ప్రాధాన్యతను క్రీడలకు ఇచ్చేవారు కాదని. ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా క్రీడల పై అవగాహన పెరిగింది అన్నారు. విద్యార్థులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేమంటే విద్యతోపాటు క్రీడల్లో పాల్గొని క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు.క్రీడలు మనకు గుర్తింపునివ్వడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఉపయోగపడతాయన్నారు.మన ప్రధానమంత్రి గౌ..నరేంద్రమోదీ గారు కూడా ఒలంపిక్ గేమ్స్ ఇండియాలో జరిపేలా ప్రయత్నం చేస్తున్నారు ఓలంపిక్ గేమ్స్ ఇండియాలో జరగాలని నేను కూడ కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు.జిల్లా ఓలంపిక్ సంఘం చైర్మన్ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ  గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల లో గల క్రీడా నైపుణ్యాలను బయటకు తీయాలని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని, క్రీడల్లో నైపుణ్యం సంపాదించినట్లయితే ఆ క్రీడాకారుడు వారి ప్రాంతాలలోనే కాకుండ ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు కూడా ఉంటుందన్నారు. విద్యార్థులు క్రీడల్లో శిక్షణ పొందడానికి మండల స్థాయిలో కూడా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన మాంటిసోరి పాఠశాల విద్యార్థులకు, మరియు విద్యార్థులను చైతన్యపరిచేలా మంచి పాటలను గానం చేసిన అహమ్మద్ మియకళాబృందానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ మెమొంటోలు బహుకరించారు. కార్యక్రమానికి ముందు నగరంలోని ఓల్డ్ టౌన్ , స్టేడియం, ఏపీ ఎస్పీ క్యాంప్, ఖానా ఖజానా బిల లాగేట్, చెన్నమ్మ సర్కిల్,ఈ ఐదు సెంటర్ల నుండి రాజవిహార్ దగ్గరలోని ఎల్ఐసి కార్యాలయం వద్ద చేరుకొని అక్కడినుండి భారీగా విద్యార్థిని విద్యార్థుల ర్యాలీ అవుట్ డోర్ స్టేడియం చేరుకున్నారు.ఈ సమావేశంలో ఓలంపిక్ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేఈ జగదీష్ కుమార్,శ్రీనివాసులు , రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, క్రీడాయి సంస్థ ప్రతినిధులు సాయిరామిరెడ్డి, బ్రిడ్జెస్ సింగ్, గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ రవి, విద్యావేత్త కెవి సుబ్బారెడ్డి, సెట్కూరు సీఈఓ పి.వి రమణ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఓలంపిక్ సంఘం ప్రతినిధులు గంగాధర్ గౌడ్, సుధాకర్ గౌడ్,సునీల్  కుమార్ ,రుద్రా రెడ్డి,అవినాష్ శెట్టి,ఈశ్వర్ నాయుడు,జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి జోసెఫ్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author