ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురండి..
1 min readకర్నూలులో ప్రాజెక్టులు పూర్తి చేయండి
- సీఎం చంద్రబాబు నాయుడును కోరిన లక్కీ–2 రాం పుల్లయ్య యాదవ్
కర్నూలు, పల్లెవెలుగు: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కర్నూలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి లక్కీ 2 రామ్ పుల్లయ్య యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచాలని లేని పక్షంలో జగన్ పట్టిన గతి పడుతుందని ఆయన తెలిపారు. జగన్ నియంతల వ్యవహరించడం జరిగిందని ఇటువంటి పాలన జనం ఓటు ద్వారా బుద్ధి చెప్తారని తెలిపారు . కర్నూలు పార్లమెంటులో పూర్తి కానీ ప్రాజెక్టుల పనులను చేపట్టాలని, గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టుల పనులను వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు ఇండియా కూటమితో జతకట్టాలని లేని పక్షంలో మోడీని ఒప్పించి ప్రత్యేక హోదా సాధించాలని ఆయన కోరారు. తనకు పార్లమెంట్ నియోజకవర్గంలో 70 వేల ఓట్లు పైగా ఓట్లు సాధించగలిగానని తనకు సహకరించిన ఓటర్లకు ఉద్యోగులకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు మహిళలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అని తెలిపారు. అనంతరం స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేయాలని ఇండియా కూటమికి మద్దతు ఇస్తే ప్రత్యేక హోదా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఓట్ల శాతం కాంగ్రెస్కి పెరిగిందని దేశంలో ప్రధానిగా రాహుల్ గాంధీ చేరువలో ఉన్నారని ఆయన తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మైనారిటీ నాయకులు మాలిక్ బాషా, కెడిసీసీ బ్యాంక్ మాజి డైరక్టర్ పి. లోకనాథ్ యాదవ్ , కాంగ్రెస్ యువ నాయకులు ప్రదీప్, వెంకటేశ్ యాదవ్ పాల్గొన్నారు.