ఆరు నెలల్లో అనేక కొత్త బస్సులు ఏలూరు డిపోకు తీసుకురావడం అభినందనీయం
1 min read3 సూపర్ లగ్జరీ బస్సులు ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)
డబుల్ ఇంజన్ సర్కార్ వేగంగా దూసుకెళ్తోంది విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా ఏలూరు నందు సోమవారం కొత్త బస్టాండ్ నందు నూతన సూపర్ లగ్జరీ 3 బస్సుల్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ బస్సులు ఏలూరు నుండి హైదరాబాద్ కి నడపడం జరుగుతుంది.ఈ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు మాసాలు అయిందని ఈ ఆరు మాసాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గోతులు లేనటువంటి రోడ్లని ఏర్పాటు చేసి ప్రజలకి ఉత్తమమైన ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అదే విధంగా ఈ ఆరు నెలల కాలంలో అనేక కొత్త బస్సుల్ని ఏలూరు డిపో కి తీసుకురావడం అభినందనీయమని త్వరలో మరిన్ని బస్సులు వస్తాయని తెలియజేశారు.ఈ సందర్భంగా కో- ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని ప్రజలకు కావలసినఅన్ని సౌకర్యాలు కల్పించడంలో దూసుకు వెళ్తున్నారని తెలియజేశారు. విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డిఅప్పలనాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం డబల్ ఇంజిన్ సర్కారు వేగంగా దూసుకెళ్తోంది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారద్యంలో ఆర్టీసీని ముందుకు నడిపించే విధంగా అనేక చర్యలు తీసుకుంటున్నారని ఇటీవల మన ప్రభుత్వం నుంచి ఉచిత బస్సు కోసం ఒక కమిటీ ఏర్పడి బెంగళూరులో అధ్యయనం చేయడం జరిగిందని అన్నారు. ఉగాది నుంచి మహిళలకి ఉచిత బస్సులు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అనేక పల్లె వెలుగు బస్సులు ఇంకా ఎక్స్ప్రెస్లు తొందర్లో వస్తాయని ప్రజలకి అనుగుణంగా మరిన్ని సేవలు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏలు డిపో మేనేజర్ బి.వాణి, అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ జి .మురళి,అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఐ.ప్రేమ్ కుమార్,పి.ఆర్వో నరసింహం అనేకమంది కార్మికులు పాల్గొన్నారు.