జాతీయ కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ బురదగుంట కాంతి రవి కిరణకు మాతృవియోగం
1 min readఅమ్మకు ఆత్మీయ వీడ్కోలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జాతీయ కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ బురదగుంట కాంతి రవి కిరణ్ తల్లి శ్రీమతి లీలా పద్మ భాయ్ (83) బుధవారం కన్నుమూశారు. ఈమె సెయింట్ థెరీసా ఇంగ్లీష్ మీడియం ఎలిమెంట్రీ స్కూల్లో సుదీర్ఘ కాలం (40) పాటు పనిచేశారు. పద్మా భాయ్ భర్త పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి పదవి విరమణ అనంతరం కాలం చేశారు. ఈమెకు ఐదుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమారుడు రవికిరణ్ (క్రాంతి) జాతీయ కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు నిర్వహించి ప్రస్తుతం రాష్ట్ర స్పోక్ పర్సన్ గా ఉన్నారు. పద్మాభాయ్ మరణ వార్త తెలియగానే బంధుమిత్రులు, సాహాచర్లు, ఆత్మీయులు, సంఘ సేవకులు, జర్నలిస్టులు ఆర్ఆర్ పేటలో నివాసానికి విచ్చేసి ఆమెకు ఘనంగా నివాళులర్పించి ఆమె ఆత్మ దైవ సన్నిధి చేరుకోవాలని కోరుకుంటూ పుష్పగుచ్చాలతో వీడ్కోలు పలికారు. గురువారం తంగెళ్ళమూడి క్రైస్తవ సమాధుల తోటలో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.